టమాటా చెట్నీకి కావాల్సిన పదార్థాలు :
టమాటా 1 కేజీ
మీడియం కప్ కారం
కప్ వెల్లుల్లి దంచ్చినవి
ఆఫ్ కప్ శెనిగపప్పు
పల్లి నూనె తగినంత
చింతపండు గుప్పెడంత
ఆవాలు, జీలకర
మెంతులు 2 స్పూన్
తగినంత ఉప్పు
టమాటా చెట్నీ తయారు చేయు విధానం :
ముందుగా టమాటాలను కడిగి తీసుకోని 4 ముక్కలుగా కట్ చేసుకొని బౌల్ లో వేసుకోవాలి. స్టావ్ ఆన్ చేసి బౌల్ పెట్టి ముక్కలుగా కట్ చేసిన టమాటలను అలాగే చింతపండు వేసి కొంచం ఉడికిన తరువాత కారం వేసి 5 నిమిషాల ఒకసారి కలుపుతూ దగ్గరకి వచ్చేదాకా ఉడకపెట్టాలి ఆలా ఉడకపెట్టి పక్కన పెట్టాలి మరో బౌల్ తీసుకోని తగినంత ఆయిల్ పోసి వేడి అయ్యాక ఆవాలు, జీలకర వేయాలి అవి వేగిన తరువాత దంచ్చినవి కప్ వెల్లుల్లి ఆఫ్ కప్ శెనిగపప్పు, మెంతులు 2 స్పూన్, వేసాక ఉడకపెట్టిన టమాటా అలానే ఉప్పు వేసి 10 నిముషాలు మీడియం ఫ్లెమ్ ల పెట్టి దగ్గరకు వచ్చేదాక బాగా కలిపి పక్కనపెట్టుకోవాలి అంతే టమాటా చెట్నీ రేడీ అయ్యింది.