చికెన్ పచ్చడి తయారుచేయువిధనం :ముందుగా ఒక 1 కీలో బోన్ లెస్ చికెన్ ని చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. అలా తీసుకున్న చికెన్ ఒక పాత్రలో వేసి టీస్పూన్ ఉప్పు వేసి 2లేదా 3 సార్లు కడగాలి. కడిగిన తరువాత స్టవ్ ఆన్ చేసి పన్ పెట్టి చికెన్ కి సరిపడ నీటిని పోసి 5 లేదా 6నిమిషాలపాటు కలుపుతూ ఉడికించాలి. అలా ఉడికించిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఒక జాలి పాత్రలో వడకట్టాలి ఒక 10 నిమిషాల పాటు నీరు పోయేదాకా పక్కన పెట్టుకోవాలి. అలా చేసిన తరువాత స్టవ్ వెలిగించి ఒక నాన్స్టిక్ కడాయి తీసుకొని ఒక 1/2 కేజీ సాన్ఫ్లవర్ నూనెను తీసుకొని అది వేడి అయ్యాక వడకట్టి పక్కన పెట్టిన చికెన్ ను నూనెలో వేసి బ్రౌన్ కలర్ వచ్చేదాకా మీడియం ఫ్లేమ్ ల పెట్టి చికెన్ నీ వేయించాలి అలా వేయించిన చికెన్ పాత్రలో వేసుకోవాలి .వేయించిన నూనెను పక్కన పెట్టుకోవాలి మరో పాత్రను తీసుకొని 1/2కేజీ పల్లి నూనె తీసుకొని వేడి చేసుకోవాలి అలా వేడయ్యాక అందులో 1కప్ అల్లంవెల్లుల్లిని పేస్ట్ అలానే 2టీస్పూన్ల దంచిన వెల్లుల్లి వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేయించాలి అలా వేయించిన అల్లంవెల్లుల్లి పేస్ట్ పూర్తిగా చల్లగాయ్యేదాక పక్కన పెట్టుకోవాలి చల్ల పడ్డాక అందులో ఒక టీస్పూన్ పసుపు, ఒక కప్ కారం పొడి ,1 1/2 టీస్పూన్ ధనియాలపొడి,1/2టీస్పూన్ ఘరం మసాలా,టీ గ్లాస్ నిమ్మరసం ,ఒక టీస్పూన్ ఉప్పు వేసి బాగా కలపాలి అంతే చికెన్ పచ్చడి రెడీ అయ్యింది .