ఉసిరికాయ పచ్చడి కావాల్సిన పదార్థాలు:
500 గ్రాముల ఉసిరికాయాలు (ఉసిరికాయలు కడిగి వడకట్టాలి నీరు ఉసిరికాయ కు ఉండకుండా చూసుకోవాలి )
కారం పొడి 100 గ్రాములు
ఉప్పు 50 గ్రాములు
ఆవా పొడి 2 స్పూన్
మెంతి పొడి 1/2 స్పూన్
నువ్వుల పొడి 2 స్పూన్
పల్లి నూనె 1 కేజీ
పసుపు 1/2 స్పూన్
వెల్లుల్లి వొలిచినవి 50 గ్రాములు
ఆవాలు 2 స్పూన్
జీలకర్ర 1 స్పూన్
రెండు నిమ్మకాయల రసం
(ఉసిరికాయ మంచి పోషకాహారం .అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంది. విటమిన్ సి అధికంగా ఉంటుంది.)
తయారు చేయు విధానం:
ముందుగా స్టవ్ ఆన్ చేసి పన్ పెట్టుకోవాలి అది వేడి అయ్యాక అందులో పల్లి నూనె పోయాలి నూనె వేడి అయ్యాక ఉసిరికాయలను నూనెలో వేసి బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించుకోవాలి అలా వేయించిన ఉసిరికాయలను పక్కన పెట్టుకోవాలి మరో పన్ పెట్టుకొని తగినంత నూనె పోయాలి నూనె వేడి అయ్యాక ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత అందులో వెల్లుల్లి పసుపు వేయాలి అవి వేగిన తరవాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తలింప్పు పెట్టిన దానిలో వేయించిన ఉసిరికాయలను అలానే, 1/2 కప్ కారం పొడి, తగినంత ఉప్పు ,ఆవా పొడి, 1 స్పూన్ మెంతి పొడి, 1/2 స్పూన్ నువ్వుల పొడి, 1/2 టీ గ్లాస్ నిమ్మరసం వేసి బాగా కలపాలి అంతే ఉసిరికాయ పచ్చడి తయారు అయ్యింది.
పచ్చడి వెంటనే తినకూడదు ఒక రెండు రోజుల తరువాత తినాలి అప్పుడే అది రుచిగా ఉంటుంది