నవ నర్సింహ క్షేత్రంలో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఒక్కటి , యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒక దివ్య క్షేత్రం. యాదాద్రికి సంబంధించిన కథకు మూలం వాల్మీకి రామాయణంలో ఉంది. విభాండక ఋషి కుమారుడు రుష్యశృంగుడు. అతని కుమారుడు హాద ఋషి. అతనినే హాదర్షి అని కూడా అంటారు. అతను నరసింహ స్వామి భక్తుడు. అతనికి స్వామివారిని ప్రత్యక్షంగా చూడాలని కోరిక పుట్టింది. ఆంజనేయస్వామి సలహా మేరకు తపస్సు చేయగా స్వామి ప్రత్యక్షమవుతాడు. ఆ ఉగ్ర నరసింహ మూర్తిని […]