డేంజర్ జోన్లో కడెం ప్రాజెక్టుTG: భారీ వరద ప్రవాహంతో నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు డేంజర్ జోన్లోకి వెళ్లిపోయింది. దీంతో మొత్తం 18 గేట్లు ఎత్తి జలాలను కిందికి వదులుతున్నారు. ఇన్ఫ్రా 2.30 లక్షల క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 2.78 లక్షల క్యూసెక్కులు ఉంది. పూర్తిస్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 695 అడుగుల వద్ద కొనసాగుతోంది. దీంతో అధికారులు నిత్యం అప్రమత్తంగా ఉంటూ పరిస్థితిని పర్య వేక్షిస్తున్నారు.