రేపు ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు భారీ వర్షాలు, వరదలతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. రేపు కూడా భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లాలో స్కూళ్లకు సెలవు ప్రకటించారు. అటు హైదరాబాద్జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థలకు సెలవు ఇచ్చారు. స్థానిక పరిస్థితులను బట్టి రేపు సెలవు ప్రకటించడంపై అధికారులు ఇవాళ సాయంత్రం నిర్ణయం తీసుకునేఅవకాశం ఉంది.