50 ఏళ్లలో ఎన్నడూ లేనంత వర్షం.. జలదిగ్బంధంలోవిజయవాడAP: భారీ వర్షాలు, వరదల ధాటికి విజయవాడ అతలాకుతలం అవుతోంది. ఒకవైపు 30 సెంటీమీటర్ల వాన మరోవైపు బుడమేరు వాగు పొంగడంతో ఈ దుస్థితి నెలకొంది. చాలా కాలనీలు నీటమునిగాయి. జనజీవనం పూర్తిగా స్తంభించింది. కొందరు ఆహారం, నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఎమ్మెల్యే లు కాలనీల్లో పర్యటిస్తూ సహాయక చర్యలు చేపడుతున్నారు. విజయవాడలో గత 50 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా వర్షం కురిసిందని స్థానికులు చెబుతున్నారు.