SRI THIRUMALA THIRUPATI TEMPLE HISTORY

THIRUMALA THIRUPATI TEMPLE

భారతదేశం లో అతి విశేషమైనా ఆలయం లో ఒక్కటి తిరుమల తిరుపతి దేవస్థానం ఈధి ఆంధ్ర ప్రదేశ్ ఆర్రాష్ట్రం లో చిత్తూరు జిల్లా లో ఉన్నది ఈధి దేవాలయం యొక్క స్థల  పురాణం మీకు థెలుసా…?? తెలుసుకుందాము ((ద్వాపర యుగంలో శ్రీమహావిష్ణువు దర్శనార్ధం వాయు దేవుడు, వైకుంఠానికి వస్తే ఆదిశేషువు వాయుదేవుడిని అడ్డగించి, మహావిష్ణువు మహాలక్ష్మితో పాటు శయనించి ఉన్నాడని చెప్తాడు. అడ్డగించిన ఆదిశేషువుకు వాయుదేవుడికి యుద్ధం జరుగుతుంది. అప్పుడు శ్రీమహావిష్ణువు అక్కడకు వస్తే ఇద్దరు వాళ్ళవాళ్ళ గొప్పతనం చెప్పుకొంటారు. మహావిష్ణువు వారికి పరీక్షగా మేరు పర్వతం ఉత్తర భాగంలో ఉన్న ఆనంద పర్వతాన్ని ఆదిశేషుని గట్టిగా చుట్టి పట్టుకొమని చెప్పి, వాయుదేవుడిని ఆ పర్వతాన్ని తన బలంతో అక్కడ నుండి కదిలించమని పరీక్షపెడతాడు. ఆ పరీక్షకు సమస్త బ్రహ్మాండంలో అల్లకల్లోలం నెలకొనగా చతుర్ముఖబ్రహ్మ, ఇంద్రాది దేవతల కోరికమేరకు ఆదిశేషువు ఆనందపర్వతం మీద తన పట్టు సడలించి పరీక్షనుంచి విరమిస్తాడు. దాని ఫలితంగా ఆనంద పర్వతం వాయువు ప్రభావం వల్ల అక్కడనుండి వెళ్ళి స్వర్ణముఖీ నది ఒడ్డున పడుతుంది. ఇది తెలుసుకొని ఆదిశేషువు బాధ పడతాడు. ఆ విషయాన్ని గ్రహించిన బ్రహ్మ ఆదిశేషువుని వేంకటాద్రితో విలీనం చేస్తాను అక్కడ మహావిష్ణువు వెలస్తాడు అని చెబుతాడు. ఆదిశేషువు వేంకటాద్రి పర్వతంలో విలీనం అయి ఆదిశేషువు పడగ భాగంలో (శేషాద్రి) శ్రీమహావిష్ణువు వెలశాడు, శేషువు మధ్య భాగం అహోబిలంలో శ్రీ నారసింహమూర్తిగా, తోక భాగమైన శ్రీశైల క్షేత్రములో మల్లికార్జునస్వామిగా వెలశారు.
పురాణాల ప్రకారం తిరుమల ఆదివరాహ క్షేత్రంగా భావించబడుతుంది. హిరణ్యాక్షుని చంపిన తరువాత, వరాహుడు ఈ కొండపై నివసించాడు. తిరుమల ఆలయం గురించి ఎక్కువగా అంగీకరించబడిన పురాణం శ్రీ వెంకటాచల మహాత్యం.కలియుగం కాలంలో, త్రిమూర్తులలో ఎవరు గొప్ప దేవుడో తెలుసుకొనేందులకు ఋషులకు యజ్ఞం చేయమని నారదుడు సలహా ఇచ్చాడు. వారు భృగు మహర్షిని త్రిమూర్తుల దగ్గరకు పంపుతారు. అహం ప్రాతినిధ్యంగా పాదంలో అదనపు కన్ను ఉన్న భృగువు బ్రహ్మ, శివుడిని సందర్శించగా వారు ఋషిని గుర్తించలేదు. చివరికి అతను విష్ణువును సందర్శించినపుడు విష్ణువు భృగుని గమనించనట్లుగా వ్యవహరించాడు. కోపంతో, భృగు విష్ణువు ఛాతీపై తన్నాడు. దానికి విష్ణు క్షమాపణ చెప్పి, ఋషి పాదాలను వత్తేటప్పుడు పాదంలో ఉన్న అదనపు కన్నును చిదిమేశాడు. విష్ణువు ఛాతీలో నివసించే లక్ష్మి భృగు చేసిన పనిని అవమానంగా భావించి వైకుంఠాన్ని వదిలి భూమిపై కొల్లాపూర్ వెళ్తుంది. కొల్లాపూర్‌లో ఉన్న సమయంలో, లక్ష్మీ కొల్హాసుర అనే రాక్షసుడిని ఓడిస్తుంది. ఈమెను ప్రేమపూర్వకంగా అంబాబయి అని అంటారు. ఆమె ఇక్కడి మహాలక్ష్మీ ఆలయం, కొల్హాపూర్లో దేవతగా పూజలందుకుంటున్నది.విష్ణువు వైకుంఠాన్ని విడిచిపెట్టి, శ్రీనివాసుడిగా మానవ రూపాన్ని పొంది లక్ష్మిని వెతుక్కుంటూ తిరుమల కొండలకు చేరుకుని ధ్యానం చేయడం ప్రారంభించాడు. శ్రీనివాసుని పరిస్థితి లక్ష్మికి తెలిసి శివుని, బ్రహ్మదేవుని ప్రార్థిస్తుంది. అప్పుడు శివుడు, బ్రహ్మ ఆవు, దూడగా మారుతారు. వాటిని తిరుమల కొండలప్రాంతాన్ని పాలించే చోళ రాజుకు అప్పగిస్తుంది. ఆవు మేత కోసం వెళ్లినప్పుడు ప్రతిరోజూ శ్రీనివాసునికి పాలు ఇస్తుంది. ఒక రోజు ఆవులకాపరి దీనిని చూసి కర్రతో కొట్టడానికి ప్రయత్నించగా శ్రీనివాసునికి గాయం అవుతుంది. శ్రీనివాసుడు ఆగ్రహించి సేవకుల అపరాధం రాజులు భరించాలి కాబట్టి చోళ రాజుని రాక్షసుడిగా మారమని శపిస్తాడు. రాజు శాపవిమోచనం కోసం ప్రార్థించగా, రాజు ఆకాశరాజుగా జన్మించి తన కుమార్తె పద్మావతిని శ్రీనివాస రూపంలో వున్న విష్ణునికి వివాహం చేయమని చెప్తాడు.[12] శ్రీనివాసుడు అక్కడ నుండి వకుళా దేవి ఆశ్రమానికి వెళ్లాడు. ఆ ప్రయాణంలో నీలా అనే గంధర్వ యువరాణి శ్రీనివాసుని చూసి ఆవుల కాపరి వల్ల తలపై గాయమై జుట్టు పోయి ఏర్పడిన మచ్చను గమనించింది. భక్తి పూర్వకంగా, ఆమె తన జుట్టును కత్తిరించి, మచ్చ ఉన్న ప్రదేశంలో శ్రీనివాస తలపై అద్భుతంగా జత చేసింది. శ్రీనివాసుడు, ఆమె భక్తితో చలించి, కృతజ్ఞతలు తెలుపుతూ, ఆమెను దేవతగా మార్చి, తన భక్తులు జుట్టు కత్తిరించుకుని దానం చేస్తారని దానిని స్వీకరించమని ఆమెను ఆశీర్వదించాడు.గత జన్మలో కృష్ణుడి పెంపుడు తల్లి యశోదయైన వకుళా దేవి, శ్రీనివాసుడు తన బిడ్డగా కావాలని ఎంతో ఆసక్తిగా ఎదురుచూసింది. గతజన్మలో కృష్ణుడి వివాహం చూడలేకపోయినందున ఈ జన్మలో చూడాలని వేడుకొనగా, కృష్ణుడు వకుళాదేవిగా జన్మంచినపుడు శ్రీనివాసుడిగా తన వద్దకు వస్తానని, ఆ తర్వాత ఆమె పెళ్లిని చూడగలదని చెప్పాడు. ఆమె ఆశ్రమంలోకి ప్రవేశించిన తరువాత, అతను “అమ్మా” అని పిలవగా వకుళా దేవి దత్తత తీసుకున్నది.
మరొక వైపు, శ్రీనివాసుడి చేత శపించబడిన తరువాత, చోళ రాజు ఆకాశరాజుగా పునర్జన్మ తీసుకుని, సంతానం కోసం యజ్ఞం చేయగా, బంగారు కమలంలో ఆడపిల్ల దొరుకుతుంది. ఆమెను పద్మావతిగా పెంచుతాడు. ఈమె లక్ష్మీ ప్రతిరూపమే. పద్మావతి చదువుకొని చాలా అందమైన యువరాణిగా ఎదిగింది.ఒక రోజు, శ్రీనివాసుడు వేటలో ఉన్నప్పుడు, అతను పద్మావతి దేవిని గమనించి, ప్రేమించాడు. ఆ సమయంలో పద్మావతి తన స్నేహితురాండ్రతో ఆడుకుంటున్నప్పుడు అకస్మాత్తుగా ఒక ఏనుగు తలెత్తి యువరాణిని వెంబడించగా పద్మావతి శ్రీనివాసుని వైపు పరుగెత్తుకుంటూ రక్షణ కోసం అతని చేతుల్లో పడుతుంది. ఆ ఏనుగు గణేశుడే. పద్మావతి, ఆమె స్నేహితురాండ్లుశ్రీనివాసుడు పరస్పర వివరాలు తెలుసుకున్నారు. శ్రీనివాసుడు పద్మావతిని వివాహం చేసుకుంటానని తెలపగా, ఆమె స్నేహితురాండ్లు శ్రీనివాసుని వెళ్లగొడతారు. శ్రీనివాసుడు వకుళాదేవి వద్దకు వెళ్లి తన పరిస్థితి చెప్పగా దానికి ఆమె వ్యక్తిగతంగా ఆకాశరాజు వద్దకు వెళ్లి మాట్లాడుతానని చెపుతుంది. రాజు తిరస్కరిస్తాడని భయపడి, శ్రీనివాసుడు సోదిచెప్పే మహిళ రూపంలో రాజభవనానికి వెళ్లి రాణికి పద్మావతి భవిష్యత్తు గురించి చెబుతూ, పద్మావతి శ్రీనివాస రూపంలో ఉన్న విష్ణువును వివాహమాడుతుందని, వకుళా దేవి అనే మహిళ త్వరలో ఈ వివాహం గురించి అడగడానికి వస్తుందని చెప్తుంది. వకుళాదేవి తన కొడుకు శ్రీనివాసుని, పద్మావతితో వివాహం చేయమని కోరినప్పుడు రాజు, రాణి అంగీకరిస్తారు.రాజకుమార్తెయైన పద్మావతికి పెళ్లికి సిద్ధమవటానికి ధనరాసులు ఉన్నాయి. శ్రీనివాసుడు, తన తల్లి పేదవారైనందున, శివుడు, బ్రహ్మ, ఇంద్రుడు సంపద దేవుడైన కుబేరుడిని ప్రార్థించాలని సూచించారు. కుబేరుడు శ్రీనివాసుని ప్రార్థనలకు సమాధానమిస్తూ డబ్బు, నగలు మొదలైన వాటిని అప్పుగా ఇచ్చాడు. శ్రీనివాసుడు తన భక్తులు ఇచ్చే డబ్బుతో అప్పు తీరుస్తానని చెప్తాడు. ఆకాశరాజు రాజభవనంలో వైభవంగా వివాహం చేసుకుని తిరుమల కొండకు తిరిగి వస్తాడు. శ్రీనివాసుడు, పద్మావతి తిరుమలలో చాలా సంవత్సరాలు నివసించి తిరిగి వైకుంఠానికి తిరిగి వెళతారు. వెంకటేశ్వర మూర్తిలో, పద్మావతి లక్ష్మీగా ఛాతీ ఒక వైపు వుంటుంది, అలాగే మరొక వైపు లక్ష్మీ మరో అవతారమైన భూదేవి వుంటుంది.ఈ పురాణానికి కొంచెంతేడాలతో ఇతర కూర్పులున్నాయి. మరో ప్రసిద్ధ రూపంలో పద్మావతి లక్ష్మి కాదు, వేదవతి పునర్జన్మ. ఈ సంస్కరణలో, శ్రీనివాస పద్మావతుల వివాహం అయిన కొన్ని నెలల తరువాత, లక్ష్మీదేవి వివాహం గురించి తెలుసుకుని, శ్రీనివాసుడిని ప్రశ్నించడానికి తిరుమల కొండలకు వెళ్తుంది. లక్ష్మీ, పద్మావతి ఎదురైనప్పుడు శ్రీనివాసుడు శిలగా మారిపోతాడు. బ్రహ్మ, శివుడు ప్రత్యక్షమై గందరగోళంలో వున్న వారికి – కలియుగం శాశ్వత కష్టాల నుండి మానవజాతి విముక్తి కోసం 7 కొండలపై ఉండాలనే ప్రభువు కోరికవలన అలా జరిగినట్లు చెప్తారు. లక్ష్మీ, పద్మావతి కూడా తమ భర్తతో ఎప్పుడూ ఉండాలని కోరుకుని రాతి దేవతలుగా మారిపోతారు. లక్ష్మీ అతని ఛాతీపై ఎడమ వైపున ఉంటుంది, పద్మావతి అతని ఛాతీ కుడి వైపున ఉంటుంది.తిరుమల ఆలయం లోని లోపలి ప్రాకారం (విమాన ప్రాకారం), ఆనంద నిలయాన్ని తొండమాన్ చక్రవర్తి నిర్మించాడని ప్రతీతి. తొండమాన్ చక్రవర్తి ఆకాశరాజు సోదరుడు.))

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
//boksaumetaixa.net/4/8043294