రైల్వే జాబ్ అప్డేట్స్

రైల్వేలో 11,558 ఉద్యోగాలు Apply Now.రైల్వేలో ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్,అండర్ గ్రాడ్యుయేట్ పోస్టుల భర్తీకి RRB షార్ట్ నటిఫికేషన్ రిలీజ్ చేసింది.SEP -14 నుంచి OCT -13 వరకు 8113 గ్రాడ్యుయేట్, SEP -21 నుంచి OCT -20 వరకు 3445 అండర్ గ్రాడ్యుయేట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ స్టేషన్ మాస్టర్ గూడ్స్ ట్రైన్ మేనేజర్ అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ట్రైన్ క్లర్క్ తదుపరి పోస్టులు ఉన్నాయి.

Loading

వదలనంటున్న వరుణుడు.. అత్యంత భారీ వర్షాలు TG:

మరో 4 రోజులు వర్షాలు కొనసాగుతాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. రేపు ఉదయం 8.30 గంటల వరకు నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో పాటు 40-50kmph వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. పయిన తెలిపిన జిల్లా ల వారు అప్రమథంగా ఉండాలని అధికారులు తెలుపరు.

Loading

ఉగ్రరూపం దాల్చిన గోదావరి ధర్మపురి నదీ(video)

ఉగ్రరూపం దాల్చిన గోదావరి ధర్మపురి నదీ : కడెంలో పూర్తి గెట్లు ఎత్తివేయడంతో ధర్మపురి గోదావరి లో భారీ వరద నీరు చేరింది గోదావరికి వచ్చే ప్రజలు అప్రమత్తంగా వుండాలి అని మునిసిపల్ శాఖవారు తెలియ చేశారు వరద నీరు ప్రవాహం పెరుగుతూ ప్రజలు జాగ్రతగా వుండాలి అని అధికారులు తెలియ చేశారు నడి తిరణ పోలీసు అధికారులు నిగా తో వునారు పోలీసు వారు నదీ లోనికి వెళ్ళడానికి అనుమతించడం లేదు గోదావరి ప్రసిత ప్రాంత […]

Loading

విజయవాడలో ఉన్న పరిస్థితి

విజయవాడ ప్రస్తుతం ఉన్న పరిస్థితి రెండు రోజులు అయిన విజయవాడ వరద ముప్పు నుంచి బయట పడతలేదు.బుడమెరు నుంచి వచ్చిన భారీ వరదల్లో చాలా కాలనీలు నీటిలో తేలుతున్నాయి.ముఖ్యంగా సింగ్ నగర్ , యనమల కుదురు ఏరియాల్లో ఒక్కోటోవ అంతస్తు వరకూ వరద నీరు చేరినందుకు బాధితులు అందోల చెందుతున్నారు. ప్రభుత్వం సహాయకచెర్యాలు చేపట్టి చాలా మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

Loading

డేంజర్ జోన్లో కడెం ప్రాజెక్టు

డేంజర్ జోన్లో కడెం ప్రాజెక్టుTG: భారీ వరద ప్రవాహంతో నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు డేంజర్ జోన్లోకి వెళ్లిపోయింది. దీంతో మొత్తం 18 గేట్లు ఎత్తి జలాలను కిందికి వదులుతున్నారు. ఇన్ఫ్రా 2.30 లక్షల క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 2.78 లక్షల క్యూసెక్కులు ఉంది. పూర్తిస్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 695 అడుగుల వద్ద కొనసాగుతోంది. దీంతో అధికారులు నిత్యం అప్రమత్తంగా ఉంటూ పరిస్థితిని పర్య వేక్షిస్తున్నారు.

Loading

FLASH NEWS.. మానేరు డ్యామ్ లో వ్యక్తి గల్లంతు

గంభీరావుపేట మండలం నర్మల మానేరు డ్యాంలో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. స్థానికుల ప్రకారం.. మాచారెడ్డి మండలం లచ్చపేట గ్రామానికిచెందిన కైరం కొండ శివరాములు (55) అనే జాలరి చేపలు పట్టేందుకు ఆదివారం ఉదయం మానేరు డ్యామ్లోకి వెళ్లాడు. ఎంత గాలించినా ఆయనఆచూకీ లభించకపోవడంతో మాచారెడ్డి మాచారెడ్డి పోలీస్స్టేషన్లో కుటుంబీకులు ఫిర్యాదు చేశారు. డ్యామ్ మత్తడి దూకుతున్నందున ఎవరు ఇక్కడికి రావద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Loading

తెలుగు బిగ్బాస్ 8′ కంటెస్టెంట్స్ వీళ్లే

‘బిగ్ బాస్ తెలుగు 8′ ఈరోజు ప్రారంభమైంది. విష్ణుప్రియ (యాంకర్), ఆదిత్య ఓం (లాహిరి లాహిరి లాహిరిలో సినిమా), అభయ్ నవీన్ (పెళ్లి చూపులు), కిర్రాక్ సీత(7arts), యష్మీగౌడ (స్వాతి చినుకులు), నిఖిల్ మలియక్కల్(గోరింటాకు సీరియల్), ప్రేరణ (కృష్ణ ముకుంద మురారీ), సోనియా (నటి), శేఖర్ భాషా(RJ), నాగమణికంఠ (యాక్టర్), పృథ్వీరాజ్(నటుడు), నైనిక (డాన్సర్), ఇన్ఫ్లూయెన్సర్స్ బెజవాడ బేబక్క, నబీల్ అఫ్రీది కంటెస్టెంట్స్.

Loading

MHBD:వరదల్లో కొట్టుకుపోయిన తండ్రీకూతురు

MHBD జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లా కారేపల్లి, గంగారాం తండాకు చెందిన నునావత్ మోతీలాల్, ఆయన కూతురు వ్యవసాయ శాస్త్రవేత్త డా. అశ్విని హైదరాబాద్ వస్తుండగా వారు ప్రయాణిస్తున్న కారు వరద నీటిలో కొట్టుకుపోయింది. అశ్విని మృతదేహం లభ్యం కాగా మోతీలాల్ ఆచూకీ లభించలేదు. వారిద్దరూ ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో జరిగే సదస్సుకు హాజరయ్యేందుకు శంషాబాద్ విమానాశ్రయానికికారులో బయలుదేరారు.

Loading

3,035 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఎప్పుడంటే?

TG: ఆర్టీసీలో తొలి దశలో 3,035 ఉద్యోగాల భర్తీకి CM రేవంత్ ఆమోదం తెలిపారని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. రాబోయే 2-3 వారాల్లో నోటిఫికేషన్లు వస్తాయని మరిన్ని పోస్టులు భర్తీ చేసే యోచనలో ఉన్నట్లు తెలిపారు. మరోవైపు RTC విలీన ప్రక్రియపై కమిటీ నిర్ణయం రావాల్సి ఉందన్నారు. ఏడాదిన్నరలో అన్ని గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పిస్తామని తెలిపారు.

Loading

అనంతారం రోడ్డం వాగు..

పొంగుతున్న అనంతారం రోడ్డం వాగు..రాకపోకలకు అంతరాయంజగిత్యాల రూరల్ మండలం అనంతారం గ్రామ రోడ్డం వాగులోకి భారీగా వరద నీరు చేరడంతో రోడ్డుపై నీరు ప్రవహిస్తోంది. దీంతో జగిత్యాల నుంచి ధర్మపురికి వెళ్లే వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్డం పైనుంచి ఎలాంటి వాహనాలు వెళ్లకుండా పోలీసులు అధికారులు బందోబస్తు ఏర్పాటు చేశారు. జగిత్యాల నుంచి ధర్మపురి వెళ్లేవారు వేరే మార్గంలో వెళ్లాలని అధికారులుసూచించారు.

Loading

Back To Top