గంభీరావుపేట మండలం నర్మల మానేరు డ్యాంలో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. స్థానికుల ప్రకారం.. మాచారెడ్డి మండలం లచ్చపేట గ్రామానికి
చెందిన కైరం కొండ శివరాములు (55) అనే జాలరి చేపలు పట్టేందుకు ఆదివారం ఉదయం మానేరు డ్యామ్లోకి వెళ్లాడు. ఎంత గాలించినా ఆయన
ఆచూకీ లభించకపోవడంతో మాచారెడ్డి మాచారెడ్డి పోలీస్
స్టేషన్లో కుటుంబీకులు ఫిర్యాదు చేశారు. డ్యామ్ మత్తడి దూకుతున్నందున ఎవరు ఇక్కడికి రావద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.