మహాశివుని జ్యోతిర్లింగంలో ఓక జ్యోతిర్లింగం శ్రీ కేదార్నాథ్ దేవాలయం రాష్ట్రం
ఉత్తరాఖండ్ రాష్ట్రం లో
రుద్రప్రయాగ జిల్లా లో ఉన్నాది ఏత వేళది భక్తులతో కికెరిసే మహా పుణ్యక్షేత్రం అసలు కేదార్‌నాథ్ ఆలయ వైభవం మరియు స్థల పురాణం తెలుసుకుందాం…? హిందూ ఇతిహాసాల ప్రకారం, ఈ ఆలయం మొదట్లో పాండవులచే నిర్మించబడిందని, శివుని పవిత్ర హిందూ మందిరాలైన పన్నెండు జ్యోతిర్లింగాలలో ఇది ఒకటిని భక్తులు నమ్ముతారు.కేదార్‌నాథ్‌లో తపస్సు చేయడం ద్వారా పాండవులు శివుడిని ప్రసన్నం చేసుకోవడం కోసం ఈ ఆలయం నిర్మించారు. ఉత్తర హిమాలయాల చోటా చార్ ధామ్ తీర్థయాత్రలోని నాలుగు ప్రధాన ప్రదేశాలలో ఈ ఆలయం ఒకటి. ఈ ఆలయం12 జ్యోతిర్లింగాలలో ఎత్తైంది. 2013లో ఉత్తర భారతదేశంలో అనుకోకుండా సంభవించిన వరదల కారణంగా కేదార్‌నాథ్ ఆలయ సముదాయం, చుట్టుపక్కల ప్రాంతాలు, కేదార్‌నాథ్ పట్టణం విస్తృతంగా దెబ్బతిన్నాయి, కాని ఆలయ నిర్మాణానికి పెద్దగా నష్టం జరగలేదు. నాలుగు గోడలకు ఒక వైపున కొన్ని పగుళ్లు కాకుండా, ఎత్తైన పర్వతాల నుండి ప్రవహించే శిథిలాల వల్ల సంభవించింది. ఆలయాన్ని వరద నుండి పెద్ద రాతి శిథిలాల మధ్య రక్షించే అవరోధంగా పనిచేసింది. మార్కెట్ ప్రాంతంలోని పరిసర ప్రాంగణాలు, ఇతర భవనాలు భారీగా దెబ్బతిన్నాయి.
చరిత్ర, ఇతిహాసాలు ప్రాకారం
కురుక్షేత్ర యుద్ధం తరువాత పాండవులు కేదార్‌నాథ్‌ను సందర్శిస్తారు
ఈ ఆలయం గంగా నదికి ఉపనది అయిన మందాకిని నది ఒడ్డున ఉన్న రిషికేశ్ నుండి, 3,583 మీ. (11,755 అ.) లేదా 223 కి.మీ. (139 మై.) దూరంలో రాతితో నిర్మించిన దేవాలయం. అసలు కేదార్‌నాథ్ ఆలయాన్ని ఎవరు, ఎప్పుడు నిర్మించారనే కచ్చితమైన వివరాలు తెలియవు. “కేదార్‌నాథ్” అనే పేరు “క్షేత్ర ప్రభువు” అని అర్ధాన్ని సూచిస్తుంది. ఇది కేదారా (“క్షేత్రం”), నాథ (“ప్రభువు”) అనే సంస్కృత పదాల నుండి వచ్చింది. “విముక్తి పంట” ఇక్కడ పెరుగుతుంది కాబట్టి దీనిని అలా పిలుస్తారు అని కాశీ కేదర మహాత్మ్య వచనం పేర్కొంది.
ఒక వేదాంత వృత్తాంతం ప్రకారం, శివుడు, నరనారాయణులు కోరిక మేరకు ఇక్కడ నివసించడానికి అంగీకరించినట్లు కథనం. కురుక్షేత్ర యుద్ధం తరువాత, వ్యాస ముని సలహా మేరకు పాండవులు యుద్ధ సమయంలో వారు తమ బంధువులను చంపినందుకు శివుడిని దర్శించి క్షమాపణ కోరటానికి ఇక్కడకు వచ్చారని కథనం. అది ముందుగా గ్రహించి, శివుడు వారిని క్షమించటానికి ఇష్టపడక, ఎద్దుగా మారి కొండపై ఉన్న పశువుల మధ్య దాక్కున్నాడు. పాండవులు ఎద్దు రూపంలో ఉన్న శివుడుని గుర్తించే సమయంలో, ఆ రూపం నేలమీద పరుండి మునిగిపోయి అదృశ్యమైంది. పాండవ సోదరులలో ఒకరైన భీముడు శివుని రూపంలో ఉన్న ఎద్దు తోకను పట్టుకుని, వారి ముందు హాజరుకావాలని, వారిని క్షమించమని బలవంతం చేశాడు. దానికి ప్రాయశ్చిత్తంగా పాండవ సోదరులు కేధార్‌నాథ్‌లో మొదట ఈ ఆలయాన్ని నిర్మించారని ఒక కథనం. శివుడి శరీర భాగాలు తరువాత మరో నాలుగు ప్రదేశాలలో కనిపించాయి. కావున సమష్టిగా, ఈ ఐదు ప్రదేశాలను ఐదు కేదారాలు (“పంచ కేదార్”) అని పిలుస్తారు. ఆ ఎద్దు తల పశుపతినాథ్ దేవాలయం ఉన్న ప్రదేశంలో కనిపించింది.పాండవుల గురించి, కురుక్షేత్ర యుద్ధాన్ని వివరించే మహాభారతం, కేదార్‌నాథ్ అనే ఏ ప్రదేశాన్ని ప్రస్తావించలేదు. కేదార్‌నాథ్ గురించి మొట్టమొదటి ప్రస్తావనల్లో ఒకటి స్కంద పురాణంలో (సుమారు 7వ -8వ శతాబ్దం) కనిపిస్తుంది. ఇందులో గంగా నది మూలాన్ని వివరించే కథ ఉంది. శివుడు తన జడలుకట్టిన జుట్టు నుండి పవిత్ర జలాన్ని విడుదల చేసిన ప్రదేశంగా కేధారా (కేదార్‌నాథ్) అనే వచన పేర్లు ఉన్నాయి.
మాధవ సంక్షేప-శంకర-విజయ ఆధారంగా హేజియోగ్రఫీల ప్రకారం, 8 వ శతాబ్దపు తత్వవేత్త ఆది శంకరాచార్యులు కేదార్‌నాథ్ వద్ద మరణించారు. ఆనందగిరి ప్రాచినా-శంకర-విజయ ఆధారంగా ఇతర హేజియోగ్రఫీలు, అతను కంచిలో మరణించాడని పేర్కొంది. శంకరాచార్యుడు మరణించిన ప్రదేశాన్ని గుర్తించే స్మారక శిథిలాలు కేధార్‌నాథ్‌లో ఉన్నాయి. కేదార్‌నాథ్ 12 వ శతాబ్దం నాటికి ముఖ్య పుణ్యక్షేత్రంగా ఉందని, గహదవాలా మంత్రి భట్టా లక్ష్మీధర రాసిన కృత్య-కల్పతరులోప్రస్తావించారు.
ఎరిక్ షిప్టన్ (1926) అనే ఆంగ్ల పర్వతారోహకుడు నమోదు చేసిన ఒక సంప్రదాయం ప్రకారం, కేదార్‌నాథ్ ఆలయానికి స్థానిక పూజారి లేరని, బద్రీనాథ్ ఆలయ పూజారే వాటి మధ్య ఒకే రోజూ ప్రయాణించి రెండు దేవాలయాలలో సేవలను నిర్వహించేవారని తెలిపారు.