అలాంటి వారిని అమరావతిలో పూడ్చాలి: చంద్రబాబు AP : అధికారులను బురదలో దించి పని చేయిస్తుంటే కొంతమంది ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని CM చంద్రబాబు ఫైర్ అయ్యారు. తప్పుడు ప్రచారం చేస్తున్నవారిని అమరావతిలో పూడ్చేయాలని ధ్వజమెత్తారు. ‘బాధితులకు రాజకీయ, సినీ ప్రముఖులు సాయం చేస్తున్నారు. ప్రజలంతా ప్రభుత్వానికి సహకరిస్తున్నారు. ఇలాంటి సమయంలో అమరావతి మునిగిందని ఫేక్ ప్రచారం చేస్తున్నారు. అలాంటి వారిని సంఘ బహిష్కరణ చేయాలి’ అని మండిపడ్డారు.