మూసీ నిర్వాసితుల పరామర్శించడానికి వెళ్తున్న మాజీ మంత్రి కేటీఆర్ కన్వాయ్

Attack on KTR

మూసీ నిర్వాసితుల పరామర్శించడానికి వెళ్తున్న మాజీ మంత్రి కేటీఆర్ కన్వాయ్ ను ముషిరాబాద్ లో కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. మంత్రి కొండా సురేఖ గారిని అవమానించిన బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా పోస్టులకు, తెలంగాణ భవన్ ఎదుట కాంగ్రెస్ శ్రేణులపై జరిగిన దాడికి క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ కార్యక్తలు డిమాండ్ చేశారు. పోలీసులు కలుగజేసుకొని ఉద్రిక్తత వాతావరణాన్ని క్లియర్ చేశారు.

మూసీ ప్రక్షాళన పేరుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న సర్వే, కూల్చివేతలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. హైదరాబాద్లో లక్షలాది మందికి నిద్రలేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పుడు ఇండ్లు కూల్చుతరోనని ప్రజలు ఆవేదనలో ఉన్నారని చెప్పారు. అంబర్పేట నియోజకవర్గంలోని గోల్నాక పరిధి తులసీరామ్ నగర్లో మూసీ ప్రాంత వాసులను మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, మహమూద్ అలీ, ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, సుధీర్ రెడ్డితో కలిసి కేటీఆర్ పరామర్శించారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
//kuptaigroo.net/4/8043294