AEE Certificate Verification
AEE(అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్) ఉద్యోగాలకు ఎంపికైన వారికి ఈ నెల 31 నుంచి HYD జలసౌధలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. 31న సివిల్, సెప్టెంబర్ 2న ఉదయం ఎలక్ట్రికల్, మధ్యాహ్నం అగ్రికల్చర్, 3న మల్టీజోన్ సివిల్ ఇంజినీర్ అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరగనుంది. అభ్యర్థులు ఇరిగేషన్ శాఖ HRMS పోర్టల్లో లాగిన్ అయ్యి వివరాలు నమోదు చేసుకోవాలని అధికారులు
సూచించారు.