గోంగూర పచ్చడి కావాల్సిన పదార్థాలు:
గోంగూర ఆఫ్ కేజీ (ఉప్పు వేసి కడిగి నీరు అడిచే విధంగా పెట్టుకోవాలి)
వెల్లుల్లి పాయలు
ఎండు మిర్చి 15
జీలకర్ర 2 స్పూన్
ఆవాలు 1 స్పూన్
2 స్పూన్స్ ధనియాలు
కొత్తిమీర ఆకు గుప్పెడంత
కరివేపాకు 5 రెమ్మలు
ఉప్పు తగినంత
నూనె తగినంత
చింతపండు ఒక రెమ్మ
గోంగూర పచ్చడి తయారీ చేయు విధానం :
ముందుగా స్టవ్వెలిగించి పాన్ పెట్టుకోవాలి పాన్ వేడయ్యాక అందులో ఒక పావ్ నూనె పోసి వేడయ్యాక అందులో జీలకర్ర కొంచం వేగిన తరువాత ఎండుమిర్చి,కరివేపాకు, కొత్తిమీర ,వెల్లుల్లి, ధనియాలు, వేసి దోరగా వేయించి చల్లగా అయ్యేవరకు పక్కన పెట్టుకోవాలి . అదే పాత్రలో ఒక పావు నూనె వేసి వేడయ్యాక గోంగూర ఆకు వేసి దగ్గరకు వచ్చే వరకూ వేయించాలి అలా వేయించిన తరువాత చల్లగా అయ్యేవరకు పక్కన పెట్టుకోవాలి.చల్లగా అయినతరువాత మిక్సిలో కొంచం కొంచం చింతపండు రసం కొంచం కొంచం ఉప్పు వేసుకుంటూ మిక్సి పట్టి పక్కన పెట్టుకోవాలి.
తాలింపు పెట్టు విధానం:
ఒక పాత్రను తీసుకొని అందులో ఒక పావ్ నూనె వేసి వేడయ్యాక అందులో ఆవాలు జీలకర్ర వేసి వేగాక ఎండుమిర్చి కరివేపాకు అవీ వేగిన తరువాత మిక్సి పట్టిన గోంగూర అందులో వేయాలి అంతే గోంగూర పచ్చడి తయారీ.
ఇది ఆరోగ్యానికి చాలా మంచిది ఇది మన శరీరంలో ఉన్న వేడిని తగ్గిస్తుంది. దీనిని మనం మాంసం ఆహారం ల ఉపయోగిస్తారు.