జగిత్యాల జిల్లా ధర్మపురి మండల వ్యాప్తంగా భారీ
వర్షాలు కురుస్తున్నాయి. వరద నీటి ప్రవాహంతో
నేరెళ్ళ గుట్ట వద్ద వంతెనపై భారీగా వరద నీరు
పొంగిపొర్లుతోంది. వరద నీటి ప్రవాహం కారణంగా
జగిత్యాల, ధర్మపురి, మంచిర్యాల మధ్య వాహనాల
ప్రయాణాలు, రాకపోకలు నిలిచిపోయాయి.
వాహనదారులు ఈ విషయాన్ని గమనించాలని
స్థానికులు కోరుతున్నారు.