వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో కొత్త జూ పార్క్: CM
TG: హైదరాబాద్ బయట దాదాపు వెయ్యి ఎకరాల
విస్తీర్ణంలో కొత్త జూ పార్క్ ఏర్పాటు చేయాలని సీఎం
రేవంత్ రెడ్డి నిర్ణయించారు. పర్యాటక అభివృద్ధి
కోసం కొత్త పాలసీ రూపొందించాలని, ఇతర రాష్ట్రాల్లో
అనుసరిస్తున్న అత్యుత్తమ పాలసీలను అధ్యయనం
చేయాలని సూచించారు. అనంతగిరి ప్రాంతంలో
అద్భుతమైన ప్రకృతి అటవీ సంపద, అక్కడున్న
200 ఎకరాల ప్రభుత్వ భూములను హెల్త్ టూరిజం
అభివృద్ధికి వినియోగించాలని ఆదేశించారు.
