మట్టన్ పచ్చడి తయారుచేయు విధానం కావాల్సిన పద్ధర్తలు : ముందుగా ఒక కీలో బోన్ లెస్ మట్టన్, తగినన్ని నీరు, ఒక ఆఫ్ కేజీ సన్ఫ్లవర్ నూనె, ఆఫ్ కేజీ పల్లి నూనె, కారం ఒక కప్, అల్లంవెల్లులి పేస్ట్, ఒక చిన్న కప్ దంచిన వెల్లులి, పసుపు ఒక స్పూన్, ఉప్పు ఒక స్పూన్, నిమ్మ రసం ఒక టీ కప్, ధనియాలా పొడి 1 1/2 స్పూన్, ఘరం మసాలా ఆఫ్ టీ స్పూన్.పచ్చడి తయారు చేయు విధానం :ముందుగా స్టోవ్ ఆన్ చేసుకొని ఒక బోల్ తీసుకోని దానిలో బోన్ లెస్ మటన్ని తీసుకోవాలి దానిలో కావాల్సిన నీటిని పోసుకొని 5 లేదా 6 నిముషాలు ఉడకపెట్టాలి. ఆలా ఉడకపెట్టిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి ఉడకపెట్టిన ముక్కలను ఒక స్టిల్ వాడకట్టే జాలి లో తీసుకోవాలి ఒక 5 నిముషాలు పక్కన పెట్టుకోవాలి. నీటిని పరపోసేసి అదే బౌన్లో సన్ఫ్లవర్ నూనె పోసి నూనె వేడి అయ్యాక ముక్కలను అందులో వేసి బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించాలి ఆలా వేయించిన ముక్కలను పక్కన పెట్టాలి ఆలా వెయ్యించిన నూనెను పక్కన పెట్టలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వేరే బౌల్ తీసుకోని దానిలో పల్లి నూనె పోసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఐటమ్స్ ఇందులో వేయాలి నూనె వేడి అయ్యాక దానిలో ఒక కప్ అల్లంవెల్లులి పేస్ట్ అలానే ఆఫ్ కప్ వెల్లుల్లి వేసి బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించాలి ఆలా వేయించక అందులోనే ఒక స్పూన్ పసుపు వేసుకోని ఆ మీశ్రమం చల్లగా అయ్యేవరకు పక్కన పెట్టుకోవాలి. ఆలా చల్లగా అయ్యాక దానిలో ఒక మీడియం కప్ కారం పొడి 1 1/2 స్పూన్ ధనియాలా ఫోడి ఒక ఆఫ్ టీ స్పూన్ ఘరం మసాలా వేసి కలపాలి కలిపినా తరువాత మనం ముందుగా వేయిచ్చుకున్న ముక్కలను వేసి కలపాలి కలిపినా తరువాత ఒక టీ గ్లాస్ నిమ్మరసం ఒక స్పూన్ ఉప్పు వేసి బాగా కలపాలి అంతే నోరు ఊరించే మట్టన్ పచ్చడి రెడీ అయ్యింది.