Sri Rajarajeshwara Temple in Vemullawada

Vellumawada Temple

శ్రీ రాజ రాజేశ్వర దేవస్థానం వేములవాడ తెలంగాణ రాష్ట్రం లో రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొలువున్న అతి పురాణమైన దేవాలయం లో ఇధి ఒక్కటి ఈ దేవాలయంలో శ్రీ రాజరాజేశ్వరీదేవి సమేతుడై రాజరాజేశ్వరుడు లింగరూపంలో వెలసి నిత్యం పూజలందుకుంటున్నాడు. భాస్కర క్షేత్రంగా, హరిహర క్షేత్రంగా పిలవబడే ఈ క్షేత్రం గురించి భవిష్యోత్తర పురాణంలోని రాజేశ్వరఖండంలో చెప్పబడింది. ఒకరోజున అర్జునుడి మునిమనవడైన నరేంద్రుడు ఒక ఋషిని చంపటం వల్ల కలిగిన బ్రహ్మహత్యాపాతకాన్ని వదిలించుకోడానికి దేశలన్నీ తిరిగి ఇక్కడికి చేరుకున్నాడట. ఇక్కడి ధర్మగుండంలో స్నానం చేసి, జపం చేస్తున్న నరేంద్రుడికి కొలనులో శివలింగం దొరికిందట. కొలను సమీపంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించిన నరేంద్రుడికి ఆ పరమాశివుడు ప్రత్యక్షమై బ్రహ్మహత్యాపాతకం నుండి విముక్తి కలిగించాడట. ఆ శివలింగమే ఇప్పుడున్న మూలవిరాట్టని అక్కడ ఉన్నా స్టం స్థలపురాణం. కాశీ, చిదంబరం, శ్రీశైలం, కేదారేశ్వరంలను పావనం చేసిన తరువాత శివుడు వేములవాడ వస్తాడని పురాణ కథనం చెప్తుంది.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
//madurird.com/4/8043294