డీఎస్సీ ఫలితాల్లో మెరిసిన దోనూర్ వాసి ధర్మపురి మండలం దోనూర్ గ్రామానికి చెందిన ఏదుల బక్కవ్వ, భీమయ్య దంపతుల పెద్ద కుమారుడు మహేశ్.. డీఎస్సీ ఫలితాల్లో సత్తాచాటాడు. స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లిష్లో ఫలితాల్లో మెరిసి ఉద్యోగం సాధించాడు. ఈ రోజు హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో నియామక పత్రం అందుకున్నారు. పట్టుదలతో మహేశ్ ప్రభుత్వ ఉద్యోగం సాధించడం పట్ల ఆయన కుటుంబసభ్యులు, గ్రామస్థులు అభినందించారు.