కరీంనగర్: షార్ట్ సర్క్యూట్.. బాలుడు సజీవ దహనంవిద్యుత్ షార్ట్ సర్క్యూట్తో బాలుడు మృతి చెందిన విషాద ఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. మానకొండూరు మండలం ఈదులగట్టపల్లి గ్రామంలో ఓ ఇంట్లో ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ జరిగింది. ఈ ఘటనలో ఇంటికి నిప్పు అంటుకుని పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో బాలుడు అంగిడి సాయికుమార్ (7) సజీవ దహనమైనట్లు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.