అసలీ న్యూస్ ధర్మపురి నియోజకవర్గం :-
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలో చాకలి (చిట్యాల) ఐలమ్మ 129వ జయంతిని వేడుకలకి ముఖ్య అతిధులుగా గౌరవ ప్రభుత్వ విప్ ధర్మపురి శాసనసభ్యులు శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని ఐలమ్మ విగ్రహానికి పూల మాల వేసి ఐలమ్మ పోరాటాన్ని,త్యాగాలను గుర్తు చేశారు. ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ముస్కు నిశాంత్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ భీమా సంతోష్ వైస్ చైర్మన్ టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు నేరేళ్ళ మహేష్ మాజీ సర్పంచులు చిర్ర గంగాధర్ రెవెల్ల సత్యనారాయణ గౌడ్ పురంషెట్టి వెంకటేష్ శరసాని తిరుపతి రెడ్డి లంబ లక్ష్మణ్ మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.