అసలీ న్యూస్ ధర్మపురి నియోజకవర్గం :
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా కళాశాల ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు…ర్యాలీ తీసి.. కళాశాల ఆవరణలో ఉన్న కలుపు మొక్కలను తొలగించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆవిర్భావ వేడుకలో కళాశాల ఇంచార్జ్ రమేష్ మాట్లాడుతూ విద్యార్థుల్లో సేవా భావం పెంపొందించేందుకే ఎన్ఎస్ఎస్ ఆవిర్భావం జరిగిందని విద్యార్థులు ప్రతి ఒక్కరితో సేవా భావంతో ఉండాలని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు.తర్వాత కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ కే.సంతోష్ కుమార్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ ఆలోచనలకు అనుగుణంగా సేవ అనే అంశాన్ని విద్యార్థులకు విద్యార్థి దశ నుండి నేర్పించాలని ఉద్దేశంతో ఏర్పడినదే జాతీయ విద్యా పథకం అని తెలిపారు.1969 సెప్టెంబర్ 24న అప్పటి కేంద్ర విద్యా శాఖ మంత్రి అయిన డాక్టర్ వి ఆర్ వి కే ఆర్ వి రావు చే ప్రారంభించబడిందని..37 విశ్వవిద్యాలయాలలో 4000 మంది NSS వాలంటీర్లుచే కళాశాల స్థాయిలో ప్రారంభించబడిందని తెలిపారు.విద్యార్థులకు విద్యార్థి దశలోనే సామాజిక సేవలో మరియు పని భావన పట్ల బాధ్యులను చేయాలనే ఉద్దేశంతో ప్రారంభించబడిందని తెలిపారు కొఠారి కమిషన్ విద్యార్థులను ఏదో ఒక విధమైన సామాజిక సేవతో ముడిపెట్టాలని సిఫారసు చేసిందని తెలిపారు.