ఆలూ Egg ఆమ్లెట్ 😋

ఆలూ ఆమ్లెట్కి కావాల్సిన పదార్థాలు:
​4 కోడి గుడ్లు
​ఒక ఆలూ (చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
​ఒక్క స్పూన్ కారం పొడి
​ఆఫ్ స్పూన్ ఉప్పు
​ఆవాలు,జీలకర్ర
​పసుపు ఆర టీ స్పూన్
​చిటికెడు మెంతిపొడి
​కొత్తిమీర ఒక కప్
​ఉల్లిపాయ 1 (ఉల్లిపాయలను సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి)
​వెల్లుల్లి 5 ( దంచి పెట్టుకోవాలి)
​కరిమేపకు ఒక రెమ్మ (చిన్న చిన్న ముక్కలుగా చేసి తీసుకోవాలి)
​ధనియాలపొడి అర స్పూన్
ఆలూ ఆమ్లెట్ వేసే విధానం :
ముందుగా కర్రీని రెడీ చేద్దాం : ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకోవాలి ఒక పావ్ నూనె పోయాలి వేడి అయ్యాక అందులో ఆవాలు జీలకర్ర వేసి కొంచెం వేగాక ఉల్లిపాయలను వేసి కొంచెం కలర్ వచ్చేదాకా మీడియం ఫ్లేమ్ లో పెట్టి వేయించాలి అలా వేయించిన తరువాత , మెంతిపొడి, వెల్లుల్లి,కరిమేపకు
వేసి వేయాలి అలా కొంచం వేగాక పసుపు వేయాలి అలా ఆలూ ముక్కలను వేసి నీరు పొయ్యకుండ నూనెలో దోరగా వేయించక కారం, ఉప్పు, ధనియాల పొడి,వేసి ఒక 5 నిమిషాల పాటు వేయించి కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి.వేరే పాత్రను తీసుకొని కోడిగుడ్లను తీసుకొని మిక్స్ చేసి అందులో ఈ కర్రీ నీ వేసి బాగా కలిపి 2 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆమ్లెట్ వేసే పన్ పెట్టుకొని ఆ మిశ్రమన్ని అందులో వేసి 5 నిమిషాల పాటు రెండు పక్కల వేయించాలి అంతే ఆలూ ఆమ్లెట్ రెడీ అయ్యింది.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
//wauthooptee.net/4/8043294