అంబరాన్ని తాకిన ఖైరతాబాద్ గణనాధుడు గణేశుడి సంబరాలు

అంబరాన్ని తాకిన ఖైరతాబాద్ గణపతి సంబరాలు

ఖైరతాబాదు వినాయకుడు (ఖైరతాబాదు గణేషుడు ఖైరతాబాదులో ప్రతి సంవత్సరం వినాయక చవితి సందర్భంగా ఏర్పాటుచేసే వినాయకుడు. 11రోజులపాటు జరిగే ఈ ఖైరతాబాదు గణేష్ ఉత్సవ మేళా ఈసారి సంబరాలు అంబారాణి అంటాయి అనే చెప్పవచ్చుప్రతి సారి లాగే ఈ ఏడాది కూడా చాలా అత్యద్భుతం గా చేశారు
రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుండేకాకుండా భారతదేశంలోని ఇతర రాష్ట్రాల నుండి వేలాదిమంది భక్తులు వచ్చి ఈ భారీ ఎత్తైన వినాయకుడిని దర్శిస్తారు. 11వ రోజు హుస్సేన్ సాగర్ సరస్సులో నిమజ్జనం చేస్తారు.

ఖైరతాబాదు వినాయకుడు1954లో ఖైరతాబాదు కౌన్సిలరుగా ఉన్న సింగరి శంకరయ్య ఈ గణేశ్ ఉత్సవాలను నిర్వహించడం ప్రారంభించాడు. 1954లో ఒక అడుగు ఎత్తు విగ్రహంతో మొదలుపెట్టిన ఉత్సవాలు 60ఏళ్ళు వరకు ఒక్కో అడుగు పెంచుతూ 2014 నుండి ఒక్కో అడుగు తగ్గిస్తూ వస్తున్నారు. విగ్రహం ఎత్తు తగ్గినా రూపకల్పనలో ప్రతి సంవత్సరం వైవిధ్యతను చాటుతున్నారు. ప్రస్తుతం శంకరయ్య సోదరుడు సింగరి సుదర్శన్‌ వినాయకుడి ఏర్పాట్లు చూసుకుంటున్నాడు. ఆనవాయితీ ప్రకారం ఉదయం పద్మశాలీలు పూజలు నిర్వహిస్తారు. 60 అడుగుల భారీ చేనేత నూలు కండువా, 60 అడుగుల గాయత్రి యజ్ఞోపవీతాన్ని చేనేత కార్మికులు ప్రత్యేకంగా చేయించి ఖైరతాబాద్ గణనాధునికి సమర్పిస్తారు
తొలినాళ్ళో హైదరాబాదు నగరమంతా వినాయకులను నిమజ్జనం చేసినా ఇక్కడ మాత్రం 20 నుంచి నెల రోజుల వరకు ఉత్సవాలు నిర్వహించేవారు.1960లో ఏనుగుపై ఊరేగిస్తూ సాగర్‌కు తీసుకెళ్లి నిమజ్జనం చేశారు.11 అడుగుల విగ్రహాన్ని తయారుచేసినప్పుడు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు.1982లో భాగ్యనగర్‌ గణేష్‌ ఉత్సవ కమిటీ ఖైరతాబాద్‌ ఉత్సవ నిర్వాహకులను కలిసి 11 రోజులకే నిమజ్జనం చేసేలా ఒప్పించారు.1982లో రెండు పడవలను కలిపి వాటిపై విగ్రహాన్ని హుస్సేన్‌సాగర్‌ మధ్యలోకి తీసుకెళ్లి నిమజ్జనం చేశారు.ఇక్కడ మొదటి నుంచి లడ్డు ఏర్పాటు చేయడం లేదు. 2011లో కాకినాడ సమీపంలోని తాపేశ్వరానికి చెందిన సురుచి ఫుడ్స్‌ నిర్వాహకుడు మల్లిబాబు 500 కిలోల లడ్డూను గణపతి చేతిలో ఉంచారు.ఓసారి వినాయకుడిని వాహనంపై ట్యాంక్‌బండ్‌కు చేర్చి నిమజ్జనం చేసేందుకు క్రేన్‌ రాకపోవడంతో
నెలరోజులపాటు ట్యాంక్‌బండ్ పై ఉంచారు.
టెలివిజన్ లోనే కాకుండా 1983లో సినిమాల్లోనూ ఖైరతాబాద్‌ వినాయకుడు కనిపించాడు. కళాతపస్వి కె.విశ్వనాథ్‌ దర్శకత్వం వహించిన ‘సాగర సంగమం’ చిత్రం షూటింగ్‌ కోసం నటుడు కమలహాసన్ ఒక రోజంతా చిత్రీకరణలో పాల్గొన్నాడు. ఎన్టీఆర్, శోభన్‌బాబు లు కూడా అప్పట్లో గణపతిని దర్శించుకున్నారు.తమిళనాడుకు చెందిన శిల్పి రాజేంద్రన్‌తో పాటు దాదాపు 150 మంది కళాకారులుమూడునెలలపాటు బృందాలుగా పనిచేసి వినాయకుడికి రూపకల్పన చేస్తారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
//chicaunoltoub.net/4/8043294