TG: ఖమ్మంలో వరదలు బాధాకరమైన సందర్భమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇళ్లు దెబ్బతిన్నవారికి తక్షణ సాయంగా రూ.10 వేలు ఇవ్వాలని కలెక్టర్ ను ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఆయన మాట్లాడారు. నష్టంపై అధికారులు అంచనా వేసి నివేదికలు ఇస్తే అనుగుణంగా పరిహారం ఇస్తామని చెప్పారు. సర్టిఫికెట్లు కోల్పోయిన వారికి కొత్తవి ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు.