షాకింగ్: ఇంటికొచ్చిన భారీ మొసలి
భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్న గుజరాత్లో ఓ ఇంటికి అనుకోని అతిథి వచ్చి స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. వడోదర ప్రాంతంలో వరదల్లో 15 అడుగుల భారీ మొసలి ఓ ఇంటి వద్దకు కొట్టుకొచ్చింది. ఫతేగంజ్ ప్రాంతానికి సమీపంలోని కామ్నాథ్ నగర్ కాలనీలో ఈ ఘటన జరిగింది. ఈ విషయాన్ని అటవీ అధికారులకు తెలియజేయడంతో మొసలిని పట్టుకునేందుకు యత్నిస్తున్నారు.