పొంగుతున్న అనంతారం రోడ్డం వాగు..రాకపోకలకు అంతరాయంజగిత్యాల రూరల్ మండలం అనంతారం గ్రామ రోడ్డం వాగులోకి భారీగా వరద నీరు చేరడంతో రోడ్డుపై నీరు ప్రవహిస్తోంది. దీంతో జగిత్యాల నుంచి ధర్మపురికి వెళ్లే వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్డం పైనుంచి ఎలాంటి వాహనాలు వెళ్లకుండా పోలీసులు అధికారులు బందోబస్తు ఏర్పాటు చేశారు. జగిత్యాల నుంచి ధర్మపురి వెళ్లేవారు వేరే మార్గంలో వెళ్లాలని అధికారులుసూచించారు.